Date : 21 November 2026
Posted By : V10NEWS

గూడెంమెంట్ కాలనీలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం!

గూడెంమెంట్ కాలనీలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు..   అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం!

గూడెంమెంట్ కాలనీలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం! 30 గజాల స్థలంలోనే మూడు అంతస్తుల భవనం నిర్మాణం.. ప్రమాదాలు జరిగితే బాధ్యులెవరు..?

మేడ్చల్ జిల్లా: 

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐడీపీఎల్ గూడెంమెంట్ కాలనీలో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండానే కొందరు యథేచ్ఛగా భవన నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాలనీలోని 30 గజాల స్థలంలో సరైన అనుమతులు లేకుండానే ఏకంగా మూడు అంతస్తుల భవన నిర్మాణం చేపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇరుకైన స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఇలాంటి నిర్మాణాల వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు చోటుచేసుకుంటే ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి, ప్రారంభ దశలోనే అడ్డుకోవాల్సిన సంబంధిత మున్సిపల్ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఆగస్టులో గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో 50 గజాల స్థలంలో నిర్మించిన ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదం నుంచి కూడా సంబంధిత అధికారుల్లో మార్పు రాకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఐడీపీఎల్ గూడెంమెంట్ కాలనీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.