కరీంనగర్లో నిర్వహించిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2026–27 రాష్ట్రస్థాయి అండర్–17 బాస్కెట్‌బాల్ పోటీల్లో మెదక్ జిల్లా జట్టు ఘన విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. జట్టు సభ్యులు సమష్టి కృషి, అద్భుతమైన ఆటతీరు, పరస్పర సమన్వయంతో పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించారు. ఈ పోటీల్లో మెదక్ జిల్లా జట్టుకు BHEL జ్యోతి విద్యాలయ హై స్కూల్ నుండీ ప్రాతినిధ్యం వహించిన 10వ తరగతి విద్యార్థిని గుండుమెను గీతిక భుజంగరావు, జట్టు విజయం కోసం తన ఆటతీరుతో విశేషంగా కృషి చేశారు. జట్టు కప్ సాధించడంలో క్రీడాకారులందరూ సమష్టిగా రాణించారు. క్రీడాకారుల ప్రతిభను పాఠశాల యాజమాన్యం అభినందించింది. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల సహకారాన్ని, శిక్షణ అందించి జట్టు విజయానికి తోడ్పడిన బాస్కెట్‌బాల్ కోచ్ షేక్ అక్బర్ కృషిని ప్రశంసించారు.భవిష్యత్తులోనూ క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించి మెదక్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.