పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. లక్షా 14వేలకు దిగొచ్చిన బంగారం ధర! ఇదిగో లేటెస్ట్ రేట్స్
కొనుగోలుదారులకు బంగారం ధరలు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇయర్ ఎండింగ్లో ప్లేట్ మార్చాయి. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,25,080కి చేరింది.
ఇక ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,25,080గా ఉండగా, నిన్న ఈ ధర రూ.1,25,560గా ఉంది. అంటే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు తులంపై రూ.480 దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకుంటే రూ.1,14,650 వద్ద ట్రేడవుతోంది. అంటే జనాలు ఆభరణాల కోసం కొనుగోలు చేసేది 22 క్యారెట్ల బంగారమే కాబట్టి.. ఇప్పుడు బంగారం వాళ్లకు రూ.1.15 లక్షలకే లభించనుంది.