జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో సత్తాచాటిన భద్రాచలం బాలిక

23 Nov, 26
 0  19
జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో సత్తాచాటిన భద్రాచలం బాలిక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన 70వ పాఠశాలల క్రీడా పోటీల్లో భద్రాచలం పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని అట్టం యశస్విత అద్భుత ప్రతిభ కనబరిచింది.

అండర్-14, అండర్-17 విభాగాల్లో పోటీపడి పతకాలతో పాటు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలను సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చింది. చిన్న వయసులోనే క్రీడారంగంలో తన ప్రతిభను చాటిన యశస్విత విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినిని అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.